tennis: అరుదైన రికార్డు సృష్టించిన భారత టెన్నిస్​ దిగ్గజం బోపన్న

  • ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నీ గెలిచిన పెద్ద వయస్కుడిగా ఘనత 
  • 43 ఏళ్ల వయసులో ఈ టోర్నీలో డబుల్స్ టైటిల్ సొంతం
  • తన ర్యాంక్ కూడా మెరుగు పరుచుకున్న రోహన్ బోపన్న
Old is gold Rohan Bopanna claims title at 43

వయసు పెరిగినా తన ఆటలో వన్నె తగ్గలేదని భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న నిరూపించాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాటి చెబుతూ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.  ఏటీపీ మాస్టర్స్‌ 1000 టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇండియన్‌ వేల్స్‌ బీఎన్‌పీ పరిబాస్‌ ఓపెన్‌ టోర్నీలో 43 ఏళ్ల బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాట్‌ ఎబ్డెన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జంట 6–3, 2–6, 10–8తో టాప్‌ సీడ్‌ వెస్లే కూలొప్ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కుప్‌స్కి (బ్రిటన్‌) ద్వయంపై  విజయం సాధించింది. 

దాంతో, 2015లో సిన్సినాటి మాస్టర్స్‌లో 42 ఏళ్ల వయసులో విజేతగా నిలిచి కెనడా ఆటగాడు డేనియల్‌ నెస్టర్ సృష్టించిన రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు.  ఈ విజయంతో బోపన్న ర్యాంక్ కూడా మెరుగైంది. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకిన అతను 11వ  స్థానానికి దూసుకొచ్చాడు.

More Telugu News