rented house: బెంగళూరులో ఫ్లాట్ తీసుకోవాలంటే.. ఇన్ని చిక్కులా..?

  • మంచి డిగ్రీ, మంచి ఉద్యోగం ఉంటే సరిపోదు
  • లింక్డ్ ఇన్ లో మంచి డిస్క్రిప్షన్ తో ప్రొఫైల్ కూడా అవసరమే
  • ఐదు నెలల అడ్వాన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి
  • అగ్రిమెంట్ పై సంతకం చేసిన తర్వాతే ఇంటి కీ
Looking for a flat in Bengaluru You will need to have a strong LinkedIn profile first

బెంగళూరులో అద్దె ఇల్లు కంటే ఉద్యోగం సంపాదించడమే ఈజీలా ఉంది. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో బెంగళూరు వాసులు ఎదుర్కొంటున్న చేదు అనుభవం ఇదే మాదిరిగా ఉంది. బెంగళూరులో అద్దె ఇల్లు కోరుకునే వారు తమతోపాటు ఐడీ ప్రూఫ్, అన్ని రకాల డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలి. అన్నీ ఉన్నా ఇల్లు ఇచ్చేస్తారనుకోవద్దు. లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్ ఉందా? అని అడుగుతున్నారు. ఆ ప్రొఫైల్ కు పాప్యులారిటీ ఎంతుందో చూస్తున్నారు.

మంచి డిగ్రీయే కాదు, మంచి ఉద్యోగం ఉంటేనే అద్దె ఇల్లు లభిస్తుంది. బెంగళూరులో కొందరు యజమానులు కిరాయిదారులను ఇవన్నీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. లింక్డ్ఇన్ ఫ్రొఫైల్, వేతనానికి సంబంధించి పే స్లిప్ పత్రం చూపించాలి. చివరికి అన్నీ ఓకే అనుకున్న తర్వాత అగ్రిమెంట్ పై సంతకం చేయాలని అడుగుతున్నారు. దీంతో ఇది ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. పలువురు బాధితులు ట్విట్టర్ ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

గౌతమ్ అనే వ్యక్తి అయితే వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేశాడు. బ్రోకర్ ను సంప్రదించినప్పుడు లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్, ప్రొఫైల్ వివరాలు అడగడాన్ని పరిశీలించొచ్చు. వీటిని తీసుకుని ఇంటి యజమానులకు అందిస్తున్నారు. ఇన్ని చేసినా ఐదు నెలల అడ్వాన్స్ సమర్పించుకోవాలి. ఓ యూజర్ బ్రోకర్ తో చేసిన స్క్రీన్ షాట్ ను పరిశీలిస్తే 2బీహెచ్ కే ఫ్లాట్ కు నెలకు రూ.75వేలు అద్దెగా చెప్పడాన్ని గమనించొచ్చు. గురుగ్రామ్, హైదరాబాద్ లోనూ ఇప్పుడిప్పుడే ఈ ధోరణి విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. కాకపోతే బెంగళూరులో ఎక్కువగా ఉంది. వ్యక్తుల చరిత్ర, వారు ప్రతి నెలా సరిగ్గా అద్దె చెల్లించగలరా? తదితర విషయాలపై ఇంటి యజమానులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. 

More Telugu News