bandi: కవిత వికెట్ పడిపోయింది.. మరికొందరు క్లీన్ బౌల్డ్ అవుతారు: బండి సంజయ్

What I spoke about Kavitha is not wrong says Bandi Sanjay
  • కవిత గురించి తాను అన్న దాంట్లో తప్పు లేదన్న సంజయ్
  • తెలంగాణలో ఉన్న సామెతనే వాడానని వ్యాఖ్య
  • తప్పు చేయలేదు కాబట్టే మహిా కమిషన్ ముందు హాజరయ్యానన్న సంజయ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటుందా? అని తాను అన్న దాంట్లో తప్పేమీ లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కవిత అరెస్ట్ ను ప్రస్తావించే క్రమంలోనే ఇలా అన్నానని... ఇది మన దగ్గర వాడుకలో ఉన్న సామెతేనని చెప్పారు. 

లిక్కర్ స్కామ్ లో కవిత వికెట్ పడిపోయిందని... మరి కొందరు బీఆర్ఎస్ నేతలు త్వరలోనే క్లీన్ బౌల్డ్ అవుతారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టే కమిషన్ ముందు హాజరయ్యానని తెలిపారు.  

అంబర్ పేటలో కుక్క కాటుకు బాలుడు మృతి చెందడం, సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం వంటి వాటికి కేటీఆరే కారణమని సంజయ్ ఆరోపించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రేణుక కుటుంబ సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని చెప్పారు.
bandi
BJP
K Kavitha
KTR
BRS

More Telugu News