KL Rahul: కేఎల్ రాహుల్ ను ఉద్దేశించి అథియా పోస్ట్

Athiya Shetty post for KL Rahul
  • ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన రాహుల్
  • 75 పరుగులతో నాటౌట్ గా నిలిచిన వైనం
  • అత్యంత దృఢమైన వ్యక్తి అని కొనియాడిన అథియా
ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయి బాధపడుతున్న కేఎల్ రాహుల్ ఎట్టకేలకు మునుపటి ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన వన్డేలో 75 పరుగులు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ కు దిగిన రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత మరో 2 వికెట్లు కూడా పడ్డాయి. 

భారత్ ను విజయతీరాలకు చేర్చిన రాహుల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన భార్య అథియా శెట్టి కూడా రాహుల్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తనకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తికి ప్రేమతో అంటూ హార్ట్ ఎమోజీని పెట్టింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే అథియా శెట్టి. చాలా కాలంగా ప్రేమలో ఉన్న రాహుల్, అథియాలు పెద్దల అంగీకారంతో జనవరి 24న పెళ్లి చేసుకున్నారు.
KL Rahul
Team India
Athia Shetty

More Telugu News