నాకు కన్ను, కిడ్నీ శస్త్రచికిత్సలు జరిగాయి... నేనొక టెర్మినేటర్ ని: రానా
- తనకు కుడికన్ను సరిగా కనిపించదన్న రానా
- ఓ కిడ్నీ కూడా ఫెయిలైందని వెల్లడి
- శస్త్రచికిత్సల అనంతరం హ్యాపీగా ఉన్నానని వివరణ
తనకు కుడి కన్ను కనిపించదని, ఆ కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపాడు. అంతేకాదు, ఓ కిడ్నీ విఫలం కావడంతో, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా జరిగిందని వివరించాడు. ఆ లెక్కన తాను ఒక టెర్మినేటర్ నని అంటూ చమత్కరించాడు.
ఓసారి ఒక పిల్లవాడు ఓ కన్ను కనిపించడంలేదని తల్లితో చెప్పి ఏడుస్తున్నాడని, దాంతో, నాకు కూడా ఒక కన్ను కనిపించదని చెప్పి ఆ చిన్నారిని ఊరడించానని రానా గుర్తుచేసుకున్నాడు.
శారీరక సమస్యలకు సంబంధించి నయం అయినప్పటికీ, తనకు ఎందుకిలా జరుగుతోందని ప్రతి మనిషి ఆలోచించడం సహజమని, కానీ అలాంటి వాటిని పట్టించుకోనవసరంలేదని రానా అభిప్రాయపడ్డాడు. తాను ఇప్పుడు ఆనందంగా ఉన్నానని వెల్లడించాడు.