Jagan: ప్రధాని మోదీతో అరగంట పాటు భేటీ అయిన సీఎం జగన్

Jagan and Modi meeting ends
  • పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో భేటీ
  • పలు అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
  • కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను ప్రధాని వద్ద జగన్ ప్రస్తావించినట్టు సమాచారం. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 

నిన్న సాయంత్రమే జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత జగన్ ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మధ్యాహ్నం 2.30 గంటలకు జగన్ సమావేశం కానున్నారు. ఇతర కేంద్ర మంత్రులతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Jagan
YSRCP
Narendra Modi
BJP

More Telugu News