పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి సంచలనం
- ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన గాయత్రి-ట్రీసా జంట
- ప్రి క్వార్టర్స్ లో ప్రపంచ మాజీ నం.1 జోడీపై గెలుపు
- కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ ఓటమి
మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత సింగిల్స్ స్టార్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ నిరాశ పరిచారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన్ 13-21, 15-21తో ఆండ్రెస్ అంటాన్సెన్ (డెన్మార్క్) చేతిలో చిత్తయ్యాడు. శ్రీకాంత్ 17-21, 15-21తో కొడాయి నరవొక (జపాన్) చేతిలో ఓడిపోగా.. ప్రణయ్ 20-22, 21-15, 17-21తో ఆంథోనీ గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ లో టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి కూడా రెండో రౌండ్ లోనే వెనుదిరిగింది. ఆరోసీడ్ సాత్విక్-చిరాగ్ జంట 21-10, 17-21, 19-21తో చైనా జోడీ లియాంగ్-వాంగ్ చాంగ్ చేతిలో పోరాడి ఓడింది. ఈ టోర్నీలో పుల్లెల గాయత్రి-ట్రీసా జంట మాత్రమే మిగిలి భారత ఆశలను సజీవంగా నిలిపింది.