Team India: విశాఖ శ్రీ శారదా పీఠంలో టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్

Team India Cricketer KS Bharat Visits Visakha Sri Sarada Peetham
  • టీమిండియా టెస్టు జట్టుకు వికెట్ కీపర్‌గా భరత్
  • ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం
  • భార్యతో కలిసి రాజశ్యామల అమ్మవారికి పూజలు
  • తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
టీమిండియా క్రికెటర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ విశాఖపట్టణంలోని శ్రీ శారదా పీఠాన్ని దర్శించుకున్నాడు. భార్యతో కలిసి వచ్చిన భరత్ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశాడు. క్రికెటర్‌ను సాదరంగా ఆహ్వానించిన అర్చకులు పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు. టీమిండియా టెస్టు జట్టుకు వికెట్ కీపర్‌గా ఉన్న భరత్.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ కోసం తాను అహ్మదాబాద్ వెళ్తున్నట్టు స్వరూపానందేంద్రస్వామికి భరత్ తెలిపాడు.
Team India
KS Bharat
Visakhapatnam
Vishaka Sri Sarada Peetham

More Telugu News