USA: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు ఓ గుడ్ న్యూస్!

  • హెచ్-1బీ వీసా గ్రేస్ పీరియడ్ 180 రోజులకు పెంచాలని అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫారసు
  • ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయులకు భారీ ఊరట
  • గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియపైనా చర్చలు
 H1b visa grace period to be extended

అమెరికాలో ఉద్యోగం లేని హెచ్-1బీ వీసాదారులకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతమున్న 60 రోజుల వీసా గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పొడిగించాలంటూ అమెరికా అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫారసు చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయులకు భారీ ఊరట లభించినట్టే. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగంలో చేరని పక్షంలో సొంత దేశాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 

ఇటీవల అమెరికా టెక్ రంగంలోని లేఆఫ్స్ కారణంగా అనేక మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరిలో అధికశాతం మంది హెచ్-1బీ వీసాదారులు కావడంతో ఈ ‘60 రోజుల డెడ్‌లైన్’ వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజా సిఫారసు అమల్లోకి వస్తే.. హెచ్-1బీ వీసాదారులు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ఏకంగా 180 రోజుల సమయం చిక్కుతుంది. ఇక గ్రీన్ కార్డుల విషయంపైనా ప్రభుత్వం చర్చించింది. గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియ తొలిదశలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన అంశంపైనా సమాలోచనలు జరిపింది.

USA

More Telugu News