Vemula Prashanth Reddy: వైసీపీ, టీడీపీలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు

TS Minister Prashant Reddy comments on YSRCP and TDP
  • ఏపీలో పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందన్న ప్రశాంత్ రెడ్డి
  • వైసీపీ, టీడీపీ రెండూ మోదీకి మద్దతుగా ఉన్నాయని విమర్శ
  • ఏపీలో కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని ఎద్దేవా
ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండు పార్టీల మద్దతు మోదీకే ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా ఏపీలో అడిగే పరిస్థితే లేదని విమర్శించారు.

ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడే కేసీఆర్ వంటి నాయకుడు అవసరమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం కావాలని ఏపీలో కూడా చాలా మంది కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి గురించి ఆలోచించే వారే లేరని... అక్కడ కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని చెప్పారు. ఈ ఎనిమిది ఏళ్లలో ఏపీలో జరిగింది ఏమీ లేదని అన్నారు.
Vemula Prashanth Reddy
BRS
YSRCP
Telugudesam

More Telugu News