Nagashourya: నాగశౌర్య మూవీ నుంచి హుషారైన పెప్పీ నెంబర్!

  • అవసరాల నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
  • నాగశౌర్య సరసన నాయికగా మాళవిక నాయర్
  • సంగీతాన్ని అందించిన కల్యాణి మాలిక్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
Phalana Abbayi Phalana Ammayi song released

నాగశౌర్య - మాళవిక నాయర్ జంటకి అభిమానులు ఉన్నారు. గతంలో ఈ జంట చేసిన 'కల్యాణ వైభోగమే' సినిమా అలాంటి ఒక క్రేజ్ ను తెచ్చిపెట్టింది. అందువలన అదే జంటతో 'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' సినిమాను రూపొందించారు. ఇటు లవర్స్ ను .. అటు ఫ్యామిలీస్ ను ఆకట్టుకునే కంటెంట్ తో ఈ సినిమా వస్తోంది. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, బెన్ హుమన్ .. విష్ణుప్రియ రవి ఆలపించారు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసిన పెప్పీ నంబర్ ఇది. 

విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.  ఇక మాళవిక నాయర్ కూడా సరైనా బ్రేక్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తోంది.

More Telugu News