Jubilee Hills Housing Society: ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టొద్దు.. మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

Telangana HC bars Chiranjeevi from construction on disputed land
  • జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి  595 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసిన చిరంజీవి
  • ఆ భూమి ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించినదంటూ కొందరు కోర్టుకు
  • కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ, హౌసింగ్ సొసైటీకి కోర్టు ఆదేశం
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ప్రజోపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించారు. కొనుగోలు చేసిన భూమిలో చిరంజీవి నిర్మాణాలు కూడా చేప్టటారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.
Jubilee Hills Housing Society
TS High Court
Chiranjeevi

More Telugu News