JP Nadda: పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం పట్ల జేపీ నడ్డా స్పందన

JP Nadda opines on Port Blair municipal council election
  • పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ టీడీపీ అభ్యర్థి
  • బలపరిచిన బీజేపీ
  • కృషి, అంకితభావానికి తగిన ఫలితం లభించిందన్న నడ్డా
అండమాన్ నికోబార్ లోని పోర్టుబ్లెయిర్ లో టీడీపీ-బీజేపీ కూటమికే మరోసారి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి దక్కడం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు బీజేపీ-టీడీపీ కూటమిని అభినందిస్తున్నానని తెలిపారు. పోర్టుబ్లెయిర్ ప్రజల సంక్షేమం కోసం మీ కృషి, అంకితభావం తగిన ఫలితాన్ని ఇచ్చాయని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్ పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది గీటురాయి వంటిదని జేపీ నడ్డా పేర్కొన్నారు.
JP Nadda
Port Blair
Chairperson
TDP
BJP
Andaman Nicobar

More Telugu News