Selvi: పోర్టు బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీ మహిళా నేత సెల్వి

  • గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
  • పోర్టుబ్లెయిర్ మున్సిపాలిటీలో బీజేపీకి 10 స్థానాలు
  • కాంగ్రెస్ కూటమికి 11 స్థానాలు
  • 2 స్థానాలతో కింగ్ మేకర్ గా మారి బీజేపీకి మద్దతు ఇచ్చిన టీడీపీ
TDP leader Selvi elected as Port Blair municipal chairperson

గతేడాది అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 2 స్థానాలే అయినా, పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటులో కీలకంగా మారింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కగా, కాంగ్రెస్ కూటమి 11 స్థానాలు గెలిచింది. దాంతో టీడీపీ మద్దతుతో బీజేపీ కౌన్సిల్ పీఠాన్ని అధిష్ఠించింది. 

ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళా నేత సెల్వి 5వ వార్డు నుంచి గెలవగా, హమీద్ 1వ వార్డు నుంచి గెలిచారు. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ పదవిని ఫస్ట్ టర్మ్ బీజేపీ అభ్యర్థి చేపడతారు. ఇప్పుడు రెండో టర్మ్ లో టీడీపీకి అవకాశం వచ్చింది. 

చైర్ పర్సన్ పదవికి టీడీపీ నేత సెల్వి పోటీపడగా, బీజేపీ బలపరిచింది. చైర్ పర్సన్ బలపరీక్షలో ఎన్నికల్లో సెల్వికి 14 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థికి 10 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో, టీడీపీ నేత సెల్వి పోర్టుబ్లెయిర్ మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించింది.

More Telugu News