MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు... తిరుపతిలో రేపు రీపోలింగ్

Re polling at two booths in Tirupati
  • ఏపీలో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
  • తిరుపతిలోని రెండు బూత్ లలో రిగ్గింగ్
  • అక్రమాలను గుర్తించిన ప్రిసైడింగ్ అధికారులు
  • రీపోలింగ్ కు ఆదేశించిన ఎన్నికల సంఘం
ఏపీలో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తిరుపతిలో అక్రమాలు జరిగినట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. తిరుపతిలోని నెం.229, నెం.233 పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగినట్టు ప్రిసైడింగ్ అధికారులు గుర్తించారు. దాంతో పోలింగ్ నిలిపివేసి కేసులు నమోదు చేశారు. 

దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. తిరుపతిలోని ఆ రెండు పోలింగ్ కేంద్రాలలో రేపు (మార్చి 15) రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
MLC Elections
Repolling
Tirupati
EC

More Telugu News