Rashmika Mandanna: రష్మికకి ఆ రెండు సినిమాలు పడాల్సిందే!

Rashmika Special
  • 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ అయిన రష్మిక
  • 'సీతారామం'తోను లభించిన భారీ విజయం
  • 'వారసుడు'తో మరింత పెరిగిన క్రేజ్ 
  • మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి మెరిసే ఛాన్స్  
రష్మికకి అందమే కాదు .. అదృష్టం కూడా గట్టిగానే ఉంది. అందువల్లనే ఒకటి రెండు ఫ్లాపులు పడినప్పటికీ, ఆ వెంటనే బ్లాక్ బస్టర్ హిట్స్ పడుతూ వస్తున్నాయి. అందువలన ఎప్పటికప్పుడు తన ప్లేస్ లో నుంచి జారిపోకుండా స్టార్ హీరోయిన్స్ రేసులో కొనసాగుతోంది. 'పుష్ప' సినిమాతో తను పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈ సినిమా సీక్వెల్ మరింత భారీతనంతో నిర్మితమవుతోంది. 

ఈ మధ్యలో తెలుగులో ఆమె చేసిన 'సీతారామం' .. విజయ్ హీరోగా చేసిన 'వారసుడు' (వరిసు) భారీ వసూళ్లను రాబట్టింది. తమిళంలో ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అయితే 'పుష్ప 2' వచ్చేవరకూ ఆమె అలా వెయిట్ చేయవలసిందే. మరో తెలుగు సినిమా ఏదీ సెట్స్ పై లేదు. ఒక రకంగా ఇది ఆమె అభిమానులకు నిరాశను కలిగించే విషయమే. 

అయితే విజయ్ దేవరకొండ జోడీగా ఆమె మరో సినిమా చేయవలసి ఉంది. పరశురామ్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లవలసిన ఈ ప్రాజెక్టు కొన్ని కారణాల వలన ఆలస్యమవుతోంది. ఇక విజయ్ దేవరకొండతో సుకుమార్ చేయాలనుకున్న ప్రాజెక్టులోను ఆమె పేరునే వినిపించింది. కానీ ఇది ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఈ రెండు సినిమాలు పడితే రష్మిక జోరు మరి కొంతకాలం పాటు కొనసాగుతుందని చెప్పచ్చు. 
Rashmika Mandanna
Actress
Tollywood

More Telugu News