Perni Nani: జగన్ ను, కాపు నాయకులను తిట్టడమే పవన్ పని: పేర్ని నాని

Perni Nani fires on Pawan Kalyan
  • చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టారన్న పేర్ని నాని
  • జనసైనికులంతా చంద్రబాబుకు ఓటు వేయాలని చెపుతారని ఎద్దేవా
  • కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలనుకుంటున్నారని విమర్శ
ఈరోజు జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీని పెట్టారని ఎద్దేవా చేశారు.  జనసేనను అభిమానించే వారంతా చంద్రబాబుకు ఓటు వేయాలని చెపుతారని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ ను, కాపు నాయకులను తిట్టడమే పవన్ పని అని... ఈరోజు మచిలీపట్నంలో జరగబోయే జనసేన సభలో కూడా పవన్ ఇదే పని చేస్తారని చెప్పారు. ఇప్పటం సభకు, మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండదని అన్నారు. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాలని పవన్ తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ ఎప్పటికీ మారడని అన్నారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Perni Nani
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News