AP Assembly Session: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • మార్చి 14 నుంచి 24 వరకు అసెంబ్లీ సమావేశాలు
  • రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం
  • మార్చి 16న బడ్జెట్
  • రేపు మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ
AP Assembly Budget Sessions will commence from tomorrow

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు (మార్చి 14) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు షురూ అవుతాయి. ఈ నెల 16న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 24 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ సమావేశాల సందర్భంగా వైసీపీ సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అటు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదించనుంది.

More Telugu News