Congress: మా ఒత్తిడితోనే కవిత ఇంటికి సీబీఐ వచ్చింది: కాంగ్రెస్

CBI came to Kavitha home due to congress pressure says Pawan Khera
  • కాంగ్రెస్ వల్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కదలిక వచ్చిందన్న పవన్ ఖేరా
  • హైదరాబాద్ లో విమానం దిగగానే కవిత పోస్టర్లు కనిపిస్తున్నాయని విమర్శ
  • బీఆర్ఎస్ లో కవిత తప్ప మరో మహిళ లేరా? అని విమర్శ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో తమ పోరాటం వల్లే కదలిక వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవర్ ఖేరా అన్నారు. తమ ఒత్తిడి వల్లే కవిత ఇంటికి సీబీఐ వెళ్లిందని చెప్పారు. హైదరాబాద్ లో విమానం దిగగానే కవిత పోస్టర్లు కనిపిస్తున్నాయని... బీఆర్ఎస్ లో కవిత తప్ప మరో మహిళ లేరా? అని ప్రశ్నించారు. మహిళా సాధికారత గురించి కవితకు ఇన్నేళ్ల తర్వాత గుర్తుకొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్ప వేరే రాష్ట్రంలో కనీసం సర్పంచ్ ను కూడా గెలిపించుకునే పరిస్థితి బీఆర్ఎస్ కు లేదని అన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే క్రమంలో భారీ మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.
Congress
Pawan Khera
K Kavitha
BRS

More Telugu News