20వ అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఓయో రూమ్స్ సీఈవో తండ్రి
- గురువారం హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
- ఈ నెల 7న ఓయో సీఈవో రితేష్ పెళ్లి
- మూడు రోజులకే తండ్రి రమేష్ ను కోల్పోయిన రితేష్
తన పెళ్లి వేడుక జరిగిన రోజుల వ్యవధిలో తండ్రిని కోల్పోవడంతో రితేష్ అగర్వాల్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. ‘నాకు, మా కుటుంబానికి మార్గదర్శకుడైన మా నాన్న రమేష్ అగర్వాల్ మార్చి 10 న మరణించారని బరువైన హృదయంతో చెబుతున్నా. ఆయన పూర్తి జీవితాన్ని గడిపారు. నాకు స్ఫూర్తినిచ్చారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు’ అని రితేష్ ట్వీట్ చేశారు. ఈ నెల 7న గీతాన్షా సూద్‌తో రితేష్ వివాహం జరిగింది.