Oscar: ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీలో ఎన్టీఆర్​ తో ప్రీతి జింతా సెల్ఫీ వైరల్

Preity Selfie Moment With Jr NTR At Priyanka Chopras Pre Oscar Party
  • దక్షిణాసియా నుంచి ఆస్కార్ నామినీలకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా
  • హాజరైన ఎన్టీఆర్ తో సెల్ఫీలకు క్యూ కట్టిన ఇతర నటీనటులు
  • ఈ నెల 12న లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ ప్రదానోత్సవం
భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ నెల 12వ తేదీన (భారత్ లో 13) లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్‌‌ లో అవార్డులను ప్రకటిస్తారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ ఆర్ టీమ్ ఇప్పటికే అమెరికా చేరుకుంది. మరోవైపు బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సత్తా చాటుతున్న నటి ప్రియాంకా చోప్రా దక్షిణాసియా చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చారు. 

ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. బాలీవుడ్ సీనియర్ నటి ప్రీతి జింతా ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకున్నారు. దాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ‘నిన్న రాత్రి నేను కలిసిన ఆస్కార్ నామినీలందరికీ అభినందనలు. మీ అందరికి అవార్డులు రావాలని కోరుకుంటున్నా. దక్షిణాసియాలోని కళాకారులను ఒక్కచోటుకి తెచ్చినందుకు, ఒకరి విజయాలను మరొకరు జరుపుకున్నందుకు ప్రియాంక చోప్రాకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.
Oscar
Priyanka Chopra
Jr NTR

More Telugu News