Lauren Gottlieb: ఆస్కార్ వేదికపై అమెరికన్ నటితో ‘నాటు నాటు’ డ్యాన్స్ ప్రదర్శన

Lauren Gottlieb will dance to Naatu Naatu at Oscars 2023
  • ఈ నెల 12న పాటకు డ్యాన్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు
  • అమెరికన్ యాక్టర్, డ్యాన్సర్ లారెన్ గొట్లెబ్ నృత్యం
  • భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తీకరణ
ఆస్కార్ అకాడమీ అవార్డుల వేదికపై ఈ నెల 12న ‘నాటు నాటు’ పాట హోరెత్తిపోనుంది. కార్యక్రమానికి హాజరైన సభికులను ఉర్రూతలూగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్ అవార్డుల నామినేషన్ పొందడం తెలిసిందే. పాటకు ఉన్న ప్రత్యేక ఆదరణ దృష్ట్యా దీని ప్రదర్శనను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ పాటకు నృత్యం చేయడం లేదు.

అమెరికాకు చెందిన ప్రముఖ నటి, డ్యాన్సర్ లారెన్ గొట్లెబ్ తాను నాటునాటు పాటకు డ్యాన్స్ చేయబోతున్నట్టు ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. ‘జలక్ దిఖలాజ’ సీజన్ 6 రన్నరప్ గా గొట్లెబ్ భారతీయులకు పరిచయురాలే. ‘‘స్పెషల్ న్యూస్.. ఆస్కార్స్ వద్ద నాటు నాటుకు నేను ప్రదర్శన ఇవ్వబోతున్నాను. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మక వేదికపై భారత్ తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని లారెన్ గొట్లెబ్ పేర్కొన్నారు. తాను, రామ్ చరణ్ అకాడమీ వేదికపై డ్యాన్స్ చేయడం లేదని జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. రిహార్సల్స్ చేసే సమయం తమకు లేదన్నారు.
Lauren Gottlieb
dance
performance
Naatu Naatu
Oscars 2023

More Telugu News