K Kavitha: కవితకు మద్దతుగా ఢిల్లీలో వెలిసిన ఫ్లెక్సీలు

Flexes in Delhi in support of Kavita
  • లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత
  • ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు
  • బై బై మోదీ అంటూ ఢిల్లీలో వెలిసిన ఫ్లెక్సీలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. దేశ రాజధానిలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణ జరగనుంది. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. మరోవైపు కవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. 

మరోవైపు సోషల్ మీడియాలో సైతం కవితకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఈడీ, సీబీఐలతో వేధించి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీలో చేరితే ఏ కేసులు ఉండవని ఎద్దేవా చేస్తున్నారు. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా కవితను విచారించే అవకాశం ఉంది.
.
K Kavitha
BRS
Enforcement Directorate
Delhi Liquor Scam
Narendra Modi
BJP

More Telugu News