RCB: మరోసారి దారుణంగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు అమ్మాయిలు

RCB all out for 138 runs against UP Warriorz

  • నేడు డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • 19.3 ఓవర్లలో 138 ఆలౌట్
  • 4 వికెట్లు తీసిన ఎక్సెల్ స్టోన్

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైన బెంగళూరు జట్టు ఇవాళ యూపీ వారియర్స్ తో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఎప్పట్లానే బ్యాటింగ్ లైనప్ వైఫల్యం చెందడంతో 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఎలిస్ పెర్రీ (52), సోఫీ డివైన్ (36) మినహా మరెవ్వరూ రాణించలేదు. ముఖ్యంగా, కెప్టెన్ స్మృతి మంధన పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లో స్మృతి కేవలం 4 పరుగులే చేసి అవుటైంది. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్సెల్ స్టోన్ 4, దీప్తి శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్ 1 వికెట్ తీశారు.

RCB
UP Warriorz
WPL
  • Loading...

More Telugu News