Vishwanth: 'కథ వెనుక కథ' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

  • ప్రేమకథా చిత్రంగా 'కథ వెనుక కథ'
  • విశ్వంత్ జోడీగా శ్రీజిత ఘోష్
  • సంగీతాన్ని అందించిన శ్రావణ్ భరద్వాజ్
  • దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య
Katha Venuka katha lyrical song released

ఈ మధ్య కాలంలో ప్రేమకథా చిత్రాల జోరు మరింత పెరిగింది. ముఖ్యంగా చిన్న సినిమాలలో దాదాపు ప్రేమకథలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువ హీరోలను .. దర్శకులను ఈ తరహా సినిమాలే ప్రోత్సహిస్తున్నాయి. అలాంటి ఒక ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న మరో సినిమానే 'కథ వెనుక కథ'.
 
విశ్వంత్ - శ్రీజిత ఘోష్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'నిన్ను చూసి చూడంగా .. నా కన్నే నన్ను దాటి నీ వైపే వస్తుందే' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్ ప్రేమలో పడిన తరువాత ఒకరిని గురించిన ఆలోచన ఒకరు చేస్తూ పాడుకునే పాట ఇది. 

శ్రావణ్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ - రమ్య బెహ్రా ఆలపించారు. భాను అందించిన కొరియాగ్రఫీ బాగుంది. అవనింద్ర కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, కృష్ణఛైతన్య దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News