bihar: బీహార్ లో రెండు గ్రూపుల మధ్య వార్.. వీడియో ఇదిగో!

Man hit by bullet while recording video of fight between two groups
  • నౌగాచియా ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య ఫైటింగ్
  • మేడ మీద నుంచి వీడియో తీస్తున్న వ్యక్తి
  • గ్యాంగుల మధ్య వార్ లో పేలిన తుపాకీ
  • మేడ పైనున్న వ్యక్తికి తగలడంతో మృతి

బీహార్ లో రౌడీ ముఠాలు, గ్యాంగుల అరాచకాలు షరా మమూలే. దోపిడీలు, భూ కబ్జాలు సర్వసాధారణం. ఇదే మాదిరి అక్కడి రెండు గ్యాంగుల మధ్య పొట్లాట జరుగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. బీహార్ లోని బాగల్పూర్ పరిధిలో నౌగాచియా ప్రాంతంలో ఓ రెండు గ్రూపులు ఓ ఇంటి ముందు కొట్టుకుంటుండగా బీఈడీ చదువుతున్న ఆశిష్ కుమార్ అనే విద్యార్థి భవనం పై నుంచి వీడియో తీశాడు.

ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు కూడా ఆ ముఠాల్లో ఉన్నారు. అయినా చేతులతో పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. ఆవేశంతో తుపాకీ తీసుకుని కాల్చే ప్రయత్నం చేస్తుండగా, పక్కనున్న వ్యక్తి దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆ బుల్లెట్ వెళ్లి మిద్దె పై నుంచి వీడియో తీస్తున్న ఆశిష్ కు తగిలింది. గాయపడిన ఆశిష్ కుమార్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

స్థానిన కార్పొరేటర్ల గ్రూపుల మధ్య ఫైటింగ్ జరిగినట్టు ఆశిష్ కుమార్ సోదరుడు సచిన్ మీడియాకు తెలిపాడు. 10వ వార్డ్ కౌన్సిలర్ సోదరుడు లాల్ సింగ్ పై నౌగాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త యాదవ్, అతడి సోదరుడు, మరికొందరు కలసి దాడికి దిగినట్టు సమాచారం.



  • Loading...

More Telugu News