హాలీవుడ్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
- కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయన్న రామ్ చరణ్
- రెండు నెలల్లో గుడ్ న్యూస్ ఉంటుందని వెల్లడి
- గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో నటించాలని ఉందని వ్యాఖ్య
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమయిందని చరణ్ చెప్పారు. అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ ఆస్కార్స్ లో 'ఆర్ఆర్ఆర్' గుర్తింపు పొందడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. హాలీవుడ్ సినిమాల్లో నటించే అంశంపై ఆయన మాట్లాడుతూ... కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు కొనసాగుతున్నాయని... మరో రెండు నెలల్లో గుడ్ న్యూస్ ఉంటుందని తెలిపారు. గొప్ప సినిమాలను ఆదరించే ప్రతి దేశంలో తాను నటించాలనుకుంటున్నానని చెప్పారు.