జగన్ కు మరో లేఖ రాసిన సోము వీర్రాజు

అగ్రిగోల్డ్ బాధితులకు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఇప్పటి వరకు ఎంత మంది సమస్యలను పరిష్కరించారో చెప్పాలని అన్నారు. న్యాయం జరగకపోవడంతో మనస్తాపంతో ఇప్పటి వరకు 142 మంది బాధితులు చనిపోయారని తెలిపారు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించడానికి మీకు ఉన్న అడ్డంకులు ఏమిటో చెప్పాలని అడిగారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి, డిపాజిట్ దారులకు ఆస్తులు చెల్లించాలని సూచించారు.


More Telugu News