YSRTP: ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం

YSRTP chief YS Sharmila detained taken into preventive custody
  • తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటూ షర్మిల దీక్ష
  • రాణి రుద్రమ దేవి విగ్రహం వద్ద కూర్చున్న షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలింపు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చుకున్నాడు. నోటికి నల్ల గుడ్డ కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 

బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని ఆమె ఆరోపించారు. దానివల్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అయితే, ఈ మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అడ్డొచ్చిన కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై షర్మిల స్పందించారు. 

‘ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నా కేసీఆర్ సర్కారు పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం. మహిళల పక్షాన గొంతెత్తితే బలవంతంగా అరెస్ట్ చేస్తారా? మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సొంత పార్టీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడినా మేలుకోడు కేసీఆర్. అత్యాచారాలు, లైంగిక వేధింపుల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణను నం.1 స్థానంలో నిలిపిన దొరను, మహిళా లోకం ఎన్నడూ క్షమించదు’ అని ట్వీట్ చేశారు.
YSRTP
YS Sharmila
arrest
custody
tank bund

More Telugu News