5g smartphones: ఈ 5జీ ఫోన్లు కొంటే అమెజాన్ ప్రైమ్ చందా ఫ్రీ!

If you buy these 5G phones you can watch Prime movies for free for a year
  • ఫిఫ్త్ గేర్ స్టోర్ లో కొనుగోలు చేసిన వారికి స్పెషల్ ఆఫర్
  • ఏడాది పాటు లేటెస్ట్ సినిమాలు చూడొచ్చు
  • ఎక్చేంజ్ ఆఫర్ కింద రూ.14 వేల వరకు తగ్గింపు కూడా!
భారతదేశంలో ఫిప్త్ గేర్ స్టోర్ ను ప్రారంభించిన అమెజాన్.. తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్టోర్ లో ప్రముఖ కంపెనీల 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా అందిస్తామని తెలిపింది. దీంతోపాటు 5జి స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డీల్స్, భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్ చేసి కొత్త 5జి ఫోన్ కొనుగోలు చేస్తే రూ.14 వేల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏడాదిపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ను కూడా అందిస్తున్నట్లు వివరించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా:
ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంది. అమెజాన్ ఫిప్త్ గేర్ స్టోర్ లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,16,999 ( బ్యాంక్ ఆఫర్ల తర్వాత) మాత్రమే. ఎక్చేంజ్ ఆఫర్ కింద రూ.14,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.

ఐక్యూ జెడ్ 6 లైట్ 5జి:
ఈ 5జి స్మార్ట్ ఫోన్ 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ తో తయారైంది. ఇందులో 5000 ఎంఏహెచ్ ఇన్ బిల్ట్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. బ్యాంక్ ఆఫర్ తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.12,999 లకే సొంతం చేసుకోవచ్చు.

లావా బ్లేజ్ 5జి:
మన దేశంలో అత్యంత సరసమైన ధరలకు అందుబాటులో ఉన్న 5జి ఫోన్లలో లావా బ్లేజ్ 5జి ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా తదితర  స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అమెజాన్ ఫిప్త్ గేర్ స్టోర్‌లో ఈ ఫోన్ ను రూ.10,499 లకే కొనుగోలు చేయవచ్చు. 

వన్ ప్లస్ 11 ఆర్:
అమెజాన్ ఫిప్త్ గేర్ స్టోర్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్న మరో 5జి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11 ఆర్.. దీని స్పెసికేషన్లు.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా, 120 హెచ్ జడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అమోఎల్ ఈడీ డిస్‌ప్లే, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది. ఫోన్ ప్రారంభ ధర రూ.39,999. పాత 4జి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్ఛేంజ్ చేసుకుంటే అదనంగా రూ.3 వేలు తగ్గింపు పొందవచ్చు.

రియల్‌మి నార్జో 50:
పదిహేను వేల లోపు ధరలో అందుబాటులో ఉన్న మరో 5జి స్మార్ట్ ఫోన్ రియల్‌మి నార్జో 50.. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.13,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.2 వేల అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ లో డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 90 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
5g smartphones
amazon
5th gear strore
prime subscription
one year free

More Telugu News