Avasarala: నాది కాని కథ నాకు కిక్ ఇవ్వలేదు: అవసరాల శ్రీనివాస్

Avasaarala Interview
  • అవసరాల నుంచి మరో ప్రేమకథ 
  • నాగశౌర్య జోడీ కట్టిన మాళవిక నాయర్ 
  • సహజత్వానికి దగ్గరగా ఉంటుందన్న అవసరాల
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్  

నటుడిగా .. దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ కి మంచి పేరు ఉంది. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కలుపుకుని నడిచే ఆయన సినిమాలకు ఒక వర్గం ప్రేక్షకుల ఆదరణ ఉంది. దర్శకుడిగా ఆయన నుంచి రావడానికి 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' రెడీ అవుతోంది. నాగశౌర్య - మాళవిక నాయర్ జంటగా ఈ సినిమా నిర్మితమైంది. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అవసరాల మాట్లాడుతూ .. "దర్శకుడిగా నేను రెండేళ్లకి ఒక సినిమా చేస్తూ వెళుతున్నాను. అంతకంటే స్పీడ్ గా చేయడం నా వల్ల కాదు. ఈ కథ తెరపై కాకుండా మన పక్కింట్లో జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది" అన్నాడు. 

ఈ కథలో కొంతభాగం అమెరికాలో జరుగుతుంది. అందువలన కొన్ని రోజుల పాటు అక్కడ షూట్ చేశాము. డబ్బింగ్ చెప్పించకుండా .. సహజత్వం కోసం ఆన్ సెట్లో రికార్డు చేస్తూ వెళ్లాము. ఇక రీమేక్ సినిమాలు చేసిపెట్టమనే ఆఫర్లు కూడా వచ్చాయి .. కానీ నాకు ఇష్టం ఉండదు. నాది కాని కథను నేను వేరేవారికి చెప్పలేను. నాది కాని కథ నాకు కిక్ ఇవ్వలేదు. అందువలన రీమేక్ ల జోలికి వెళ్లే ఆలోచన లేదు" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News