జనాల్లో మార్పు కనిపిస్తోంది.... జగన్ ఏం చేసినా ఓట్లు పడవు: సీపీఐ నారాయణ
- ఏపీలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పాలన్న నారాయణ
- జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని వ్యాఖ్య
- రాక్షస పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారన్న సీపీఐ నేత
జగన్ రాక్షస పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జగన్ బటన్ నొక్కడం వల్ల ప్రయోజనంలేదని, ఏపీలో అభివృద్ధి ఎక్కడ ఉందో జగన్ చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో జనాల్లో మార్పు కనిపిస్తోందని, జగన్ ఏంచేసినా ఓట్లు పడవని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఏపీకి రూ.13 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వచ్చాయనడం కాకి లెక్కలు మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు మారేవరకు కొత్త పరిశ్రమలు రాలేవని స్పష్టం చేశారు.