AB De Villiers: టీ20 చరిత్రలోనే గొప్ప ప్లేయర్ ఎవరో చెప్పిన డీ విలియర్స్... కోహ్లీ, గేల్ కూడా కాదు..!

  • ఆఫ్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అన్న డీ విలియర్స్
  • బ్యాట్, బాల్ రెండింటిలో మ్యాచ్ విన్నర్ అని కితాబు
  • రషీద్ అంటేనే కఠినమైన పోటీ అని వ్యాఖ్య
AB De Villiers says Rashid Khan is worlds best T20 player

టీ20 చరిత్రలో గొప్ప ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్స్ వంటి దిగ్గజాల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ వరల్డ్ బెస్ట్ టీ20 క్రికెటర్ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డీ విలియర్స్ చెప్పాడు. ఐపీఎల్ లో మంచి పేరు తెచ్చుకున్న రషీద్... తన సొంత దేశం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ అభివృద్ధి చెందడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 24 ఏళ్ల ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ మ్యాచ్ విన్నర్ అని కితాబునిచ్చాడు. తన గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ రషీదే అని చెప్పాడు. బ్యాట్, బాల్ రెండింటితో రాణించే నైపుణ్యం అతనిలో ఉందని, రెండు విభాగాల్లో అతను మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. మైదానంలో అతనొక సింహమని చెప్పాడు. రషీద్ అంటేనే ఒక కఠినమైన పోటీ అని, ఎప్పుడూ గెలవాలనే అనుకుంటాడని అన్నాడు. రషీద్ బెస్ట్ ప్లేయర్లలో ఒకడు కాదని... ఆయనే బెస్ట్ అని చెప్పాడు.

More Telugu News