: రాణి వాసానికి షష్టిపూర్తి

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 రాణివాసానికి వచ్చి 60 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్కడ నాలుగు రోజుల పాటు ప్రత్యేక వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఎలిజబెత్‌-2 1953 జూన్‌ 2న రాణిగా అధికారికంగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ రాణిగారి వయసు 87 సంవత్సరాలు.

వజ్రోత్సవాల సందర్భంగా రాణిగారు తన భర్త ఫిలిప్‌(91) తో కలిసి పశ్చిమ లండన్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌లో ఆనందంగా గడిపారు. అక్కడికి అతిధులెవరినీ ఆహ్వానించలేదు. సోమవారం నాడు ఆమె భర్తతో కలిసి అంధుల జాతీయ సంస్థలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. కాగా ఈ అరవైఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంగళవారం నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాజకుటుంబంతోబాటు సుమారు 2 వేలమంది అతిధులు పాల్గొంటారు.

More Telugu News