Pawan Kalyan: జనసేనకు 20 లక్షల మంది ఫాలోవర్లు... పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan congratulates Janasena for reaching 2 million followers in Twitter
  • 2016లో జనసేన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభం
  • తాజాగా 2 మిలియన్ల ఫాలోవర్లు
  • అభినందనలు తెలిపిన జనసేనాని
జనసేన పార్టీ ఏడేళ్ల కిందట ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించగా, ప్రస్తుతం ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లకు చేరింది. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. "జనసేన పార్టీ 20 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు. జనసేన ట్విట్టర్ టీమ్ ను, జనసేన సోషల్ మీడియా సైనికులను అభినందిస్తున్నాను. పార్టీకి వెన్నుదన్ను మీరే. మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Twitter
Andhra Pradesh
Telangana

More Telugu News