పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి... తొమ్మిది మంది పోలీసు అధికారుల మృతి
- ధాదర్ పట్టణంలో ఘటన
- బైక్ పై వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సూసైడ్ బాంబర్
- ఓ పశువుల ప్రదర్శన నుంచి తిరిగి వెళుతున్న పోలీసులు
పేలుడు ధాటికి పోలీసు వాహనం తలకిందులైంది. ఓ పశువుల ప్రదర్శనకు బందోబస్తు నిర్వహించి తిరిగి వస్తున్న పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు కచ్చి జిల్లా ఎస్పీ మహ్మద్ నోతేజాయ్ వెల్లడించారు.
కాగా ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరగ్గా, అవి బలూచిస్థాన్ వేర్పాటువాదులు, స్థానిక మిలిటెంట్ల పనే అని ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి కూడా వారే చేసి ఉంటారని భావిస్తున్నారు.