WPL: డబ్ల్యూపీఎల్ లో ఆసక్తికర మ్యాచ్... టాస్ గెలిచిన ఆర్సీబీ

RCB women won the toss against Mumbai Indians
  • ముంబయి బ్రాబోర్న్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • తన తొలి మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ
  • రెండో విజయం కోసం ఉరకలేస్తున్న ముంబయి ఇండియన్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఈ పోరులో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

స్మృతి మంధన, సోఫీ డివైన్, ఎలిస్ పెర్రీ, హీదర్ నైట్, మేగాన్ షట్ లతో ఆర్సీబీ బలంగా కనిపిస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓటమిపాలైన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

ఇక, ముంబయి ఇండియన్స్ మరో విజయం కోసం ఉరకలేస్తోంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ భారీ తేడాతో గుజరాత్ జెయింట్స్ ను చిత్తుచేసింది. ఆ జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్ లో ఉండగా, హేలీ మాథ్యూస్, నాట్ షివర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, సలికా ఇషాక్ తదితరులు రాణిస్తే వరుసగా రెండో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
WPL
RCB
MI
Toss

More Telugu News