Health insurance: భారీగా పెరగనున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం!

Health insurance premiums likely to have increased by huge margin
  • 25 శాతం వరకు పెంచేసిన హెచ్ డీఎఫ్ సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్ 
  • మిగిలిన సంస్థలూ త్వరలో పెంపుబాట
  • వైద్య ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపిస్తున్న సంస్థలు
హెల్త్ ఇన్సూరెన్స్ సామాన్యుడికి భారంగా మారుతోంది. కరోనా తర్వాత భారీగా క్లెయిమ్ లు రావడంతో బీమా సంస్థలు హెల్త్ పాలసీల ప్రీమియంను లోగడ 30 శాతం వరకు పెంచాయి. తాజాగా మరో విడత ప్రీమియం రేట్లతో బాదేందుకు అవి సిద్ధమవుతున్నాయి. 

ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఇప్పటికే 10-15 శాతం మేర ప్రీమియం రేట్లను పెంచింది. హెచ్ డీఎఫ్ సీ ఎర్గో ప్రీమియం ధరలను 25 శాతం పెంచేసింది. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నివా బూపా, ఆదిత్య బిర్లా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు సైతం 8-20 శాతం స్థాయిలో ప్రీమియం ధరలను పెంచొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన ‘ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా’ ప్లాన్ ప్రీమియంను 25 శాతం పెంచింది. స్టార్ హెల్త్ పాపులర్ హెల్త్ ప్లాన్ ఇది. న్యూ ఇండియా హెల్త్ అష్యూరెన్స్ మాత్రం ప్రీమియం ధరలు పెంచలేదు. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఆధారంగా బీమా సంస్థలు ప్రీమియం రేట్లను ఇలా పెంచేస్తున్నాయి.
Health insurance
premium prices
huge hike

More Telugu News