ఉత్తరాఖండ్‌లో మూడు రోజుల వ్యవధిలో రెండో భూకంపం
- ఉత్తర కాశీలో 2.5 తీవ్రతతో కంపించిన భూమి
- గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూకంపం
- గతేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో కంపించిన భూమి
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ జిల్లాలో గురువారం 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు గతేడాది డిసెంబరులో ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇప్పుడు మరోమారు భూకంపం ప్రజలను భయపెట్టింది.