Telangana Cabinet: వచ్చేవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం

Telangana cabinet will meet next week
  • మార్చి 9న తెలంగాణ క్యాబినెట్ భేటీ
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశం
  • పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం
  • గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించే అవకాశం 
వచ్చేవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. మార్చి 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ వేదికగా క్యాబినెట్ భేటీ జరగనుంది. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. ఇళ్ల స్థలాలు కలిగి ఉండి, సొంత ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3 లక్షల సాయం, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. 

దాంతోపాటే, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పలు బిల్లులు పంపగా, గవర్నర్ పెండింగ్ లో ఉంచడం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
Telangana Cabinet
Meeting
KCR
BRS
Telangana

More Telugu News