Raghu Rama Krishna Raju: ఈ కంపెనీలకు 7 లక్షల ఎకరాల భూమిని ఎలా ఇస్తారు?: రఘురామకృష్ణరాజు

No benefit with Global summit says Raghu Rama Krishna Raju
  • గ్లోబల్ సమ్మిట్ వల్ల ఒరిగేది ఏమీ లేదన్న రఘురాజు
  • పెట్టుబడుల పేరుతో భూకబ్జాలకు యత్నం జరుగుతోందని ఆరోపణ
  • జగన్ పుట్టక ముందు నుంచే విశాఖ ఉందని విమర్శ
విశాఖలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వల్ల ఒరిగేది ఏమీ లేదని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. విశాఖ సమ్మిట్ అనేది ఒక మాయా బజార్ అని అన్నారు. పెట్టుబడుల పేరుతో భూకబ్జాలకు ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ స్థల యజ్ఞం ఏమిటని ప్రశ్నించారు. ఈ కంపెనీలకు 7 లక్షల ఎకరాల భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో చేసిందేమీ లేదని... అందుకే ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. తమ ముఖ్యమంత్రి జగన్ పుట్టక ముందు నుంచే విశాఖ ఉందని, అక్కడ పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. సజావుగా పరిపాలన కొనసాగించాలని సీఎంను కోరుతున్నానని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Jagan
YSRCP

More Telugu News