Team India: ఒక కాలు చంఢీగఢ్​లో.. మరో కాలు హర్యానాలో పెట్టాడంటూ ఆసీస్​ బ్యాటర్​పై శ్రేయస్ అయ్యర్ కామెంట్

Stump Mic Catches Shreyas Iyers Hilarious Comment On Travis Head Batting Stance
  • మూడో టెస్టు లక్ష్య ఛేదనలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ స్టాన్స్ పై శ్రేయస్ స్లెడ్జింగ్
  • స్టంప్ మైక్ లో రికార్డయిన శ్రేయస్ వ్యాఖ్యలు వైరల్
  • హిందీ అర్థం కాకపోవడంతో పట్టించుకోని హెడ్
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ పరాజయాలను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా, భారత్‌తో జరిగిన మూడో టెస్టులో అద్భుతంగా పుంజుకుంది. శుక్రవారం ఇండోర్‌లో ముగిసిన టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. అయితే ట్రావిస్ హెడ్ (49 నాటౌట్) మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) జట్టును గెలిపించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో నిరాశ పరిచింది. 

కాగా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఛేజింగ్‌లో శ్రేయస్ అయ్యర్.. ట్రావిస్ హెడ్‌ని స్లెడ్జింగ్ చేశాడు. హెడ్ బ్యాటింగ్ స్టాన్స్ గురించి అయ్యర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు స్టంప్ మై క్ లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆరో ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్ ను హెడ్ ఎదుర్కొంటున్న సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద నిలబడి ఉన్న శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మైక్ లో రికారయ్యాయి. హెడ్ కాలు ఒకటి చండీగఢ్లో ఉంటే మరోటి హర్యానాలో ఉంది అంటూ శ్రేయస్ చేసిన కామెంట్ కు తోటి భారత ఆటగాళ్లంతా నవ్వుకున్నారు. అయితే, హిందీ అర్థం కాకపోవడంతో హెడ్ స్పందించకుండా తన పని తాను చేసుకెళ్లాడు.
Team India
Australia
3rd test
Shreyas Iyers
comments
Travis Head

More Telugu News