Telangana: సంక్షేమ హాస్టళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Telangana government key decision over welfare hostels in the state
  • విద్యార్థుల సంఖ్య ఆధారంగా సంక్షేమ హాస్టళ్ల క్రమబద్ధీకరణ
  • తక్కువ విద్యార్థులు ఉన్న హాస్టళ్లను విలీనం చేసేందుకు యోచన
  • విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
సంక్షేమ హాస్టళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి కొందరిని సమీపంలోని హాస్టళ్లల్లో సర్దుబాటు చేసే అంశంపై నివేదిక ఇవ్వాలంటూ సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. డైట్ చార్జీల పెంపుతో పాటూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా హాస్టళ్ల విలీనం అంశంపై చర్చించారు. విద్యార్థులు తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేస్తే విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హాస్టళ్లల్లో మెస్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Telangana

More Telugu News