Soldiers: గాల్వన్ లోయలో తుపాకీలు పక్కన పెట్టి బ్యాట్ పట్టిన జవాన్లు

Soldiers payed cricket in Galwan
  • గతంలో రక్తంతో తడిసిన ప్రదేశంలో ఇప్పుడు క్రికెట్
  • క్రికెట్ పోటీ నిర్వహించిన పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్
  • ఉత్సాహంగా క్రికెట్ ఆడిన జవాన్లు
భారత్, చైనాల నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయ ఎప్పుడూ చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో ఇరు దేశాల సైనికులు ముఖాముఖి దాడికి పాల్పడిన ఘటనలో మన జవాన్లు దాదాపు 20 మంది చనిపోయారు. చైనా సైనికులు 40 మందికి పైగానే చనిపోయి ఉంటారని అంచనా.

అప్పుడు రక్తంతో తడిసిపోయిన పెట్రోలింగ్ పాయింట్ - 14 ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ గా మారిపోయింది. పటియాలా బ్రిగేడ్ కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీని నిర్వహించింది. పీపీ-14కు 4 కిలోమీటర్ల దూరంలో పోటీ జరిగింది. ఈ పోటీలో మన జవాన్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకులు పక్కన పెట్టి బ్యాట్ పట్టారు.
Soldiers
Cricket
Galwan Valley

More Telugu News