Thailand: బడా వ్యాపారవేత్తను పెళ్లాడిన థాయ్‌లాండ్ ట్రాన్స్‌జెండర్ సినీతార!

Transgender actress Poyd Treechada marries wealthy Thai businessman
  • పుట్టుకతో అబ్బాయిగా జన్మించిన పోయిడ్ ట్రిచాడ
  • 17 ఏళ్ల వయసులో లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారిన ట్రిచాడ
  • పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచి సినిమాల్లోకి
  • ఆరు సినిమాలతోనే స్టార్‌డమ్
థాయ్‌లాండ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ సినీతార పోయిడ్ ట్రిచాడ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. పుకెట్ ప్రావిన్స్‌కు చెందిన బడా వ్యాపారవేత్త ఓక్ భవఘా హ్యాంగ్యోక్‌ను పెళ్లాడారు. 36 ఏళ్ల పోయిడ్ అద్భుతమైన అందంతో సూపర్ మోడల్‌గా గుర్తింపు పొందారు. ఆమెకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో ఆమెకు 26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

థాయ్‌లాండ్‌లోని ఫెంగ్‌నాలో 1986లో పోయిడ్ జన్మించారు. మగబిడ్డగా పుట్టినప్పటికీ పెద్దయ్యాక అమ్మాయి లక్షణాలు కనిపించడంతో పదిహేడేళ్ల వయసులో లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. 2010లో ‘విత్ లవ్’ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ‘స్పైసీ బ్యూటీ క్వీన్ బ్యాంకాక్-2’ ఫిల్మ్ సిరీస్‌లోనూ నటించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. ఆరేళ్లలో ఆరు సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.
Thailand
Transgender actress
Poyd Treechada Petcharat
Oak Bhavagha Hongyok

More Telugu News