Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు... 500 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

  • 501 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 129 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • రెండున్నర శాతం వరకు నష్టపోయిన మారుతి షేర్ విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 501 పాయింట్లు కోల్పోయి 58,909కి పడిపోయింది. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 17,321 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (0.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.62%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.49%), ఎల్ అండ్ టీ (0.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.11%). 

టాప్ లూజర్స్:
మారుతి (-2.42%), యాక్సిస్ బ్యాంక్ (-2.29%), టీసీఎస్ (-1.91%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.71%), నెస్లే ఇండియా (-1.70%).

More Telugu News