Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 6 మండలాలకు నోటిఫికేషన్ జారీ

6 new mandals in Andhra Pradesh
  • 6 జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విభజిస్తూ నోటిఫికేషన్
  • జాబితాలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం
  • అభ్యంతరాలను నెలలోగా తెలపాలని సూచన
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 6 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అనంతపురం, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, విజయనగరంలను అర్బన్, రూరల్ మండలాలుగా... మచిలీపట్నంను సౌత్, నార్త్ మండలాలుగా విభజిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. మండలాల విభజనపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని... నెలలోగా అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేయాలని సూచించింది.
Andhra Pradesh
New Mandals

More Telugu News