అభిమాని మృతి.. సాయిధరమ్ తేజ్ సినిమా టీజర్ విడుదల వాయిదా

  • ఈరోజు విడుదల కావాల్సి ఉన్న 'విరూపాక్ష' టీజర్
  • భీమవరం అభిమాన సంఘం అధ్యక్షుడు రావూర్ పండు మృతి
  • విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర యూనిట్
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా పడింది. ఈ టీజర్ ను నిన్న సాయంత్రం చరణ్ మేనమామ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీక్షించారు. ఈ రోజు టీజర్ విడుదల కావాల్సి ఉంది. టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. 

సాయిధరమ్ తేజ్ భీమవరం అభిమాన సంఘానికి అధ్యక్షుడు అయిన రావూరి పండు (28) నిన్న క్రికెట్ ఆడుతూ, గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మరణవార్తతో సాయితేజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. టీజర్ విడుదలను వాయిదా వేయాలని సాయితేజ్ నిర్ణయించాడు. దీంతో టీజర్ విడుదల వాయిదా పడింది. కొత్త అప్డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. బైక్ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సాయితేజ్ నటించిన కొత్త చిత్రం ఇదే. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది.

Sai Dharam Tej
Tollywood
Virupaksha
Teaser

More Telugu News