Elon Musk: బెంగళూరులో మస్క్ ఫొటోకు పూజలు.. కారణం ఇదే

Bengaluru men worship Elon Musk with agarbatti in viral video
  • గతేడాది ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్
  • పురుషుల బాధను చెప్పుకునేందుకు ట్విట్టర్లో అవకాశం ఇచ్చిన మస్క్
  • కృతజ్ఞతతో మస్క్ ఫొటోకు పూజలు చేసిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్
టెస్లా, ట్విట్టర్ సంస్థల అధినేత, ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచారు. సంస్థలో భారీగా ఉద్యోగులను తొలగించి చాలా మందికి విలన్ అయ్యారు. కానీ, బెంగళూరులో కొందరు మస్క్ ను దేవుడిగా కొలుస్తున్నారు. ఆయన ఫొటోకు పూజలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరుకు చెందిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ అనే సంస్థ ఈ పని చేసి వార్తల్లో నిలిచింది. పురుషుల బాధల్ని చెప్పుకునేందుకు ట్విట్టర్‌లో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ఆ సంస్థ ప్రతినిధులు మస్క్ పై అభిమానం చాటుకున్నారు. బెంగళూరులోని ఫ్రీడం పార్కులో మస్క్ ఫ్లెక్సీకి ప్రత్యేక పూజలు చేశారు. ఫ్లెక్సీలో స్త్రీవాదులను అంతం చేసేవారు (డిస్ట్రాయర్ ఆఫ్ వొకాషురా), మెన్స్ లైవ్స్ మ్యాటర్ అనే ట్యాగ్‌లైన్ కూడా ముద్రించారు.
Elon Musk
Twitter
Bengaluru
worship
viral video

More Telugu News