Sensex: వరుసగా ఎనిమిదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • ఒత్తిడికి గురైన మెటల్ షేర్లు
  • 326 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 88 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మెటల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 58,962కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17,303 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.03%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.32%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.67%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.03%), రిలయన్స్ (-1.99%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.77%), ఇన్ఫోసిస్ (-1.46%), ఐటీసీ (-1.40%).

More Telugu News